TG: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ముమ్మరంగా దర్యాప్తు

TG: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ముమ్మరంగా దర్యాప్తు
నేడు అదనపు ఎస్పీల కస్టడీ పిటిషన్‌ వేయనున్న పోలీసులు... ముగ్గురిని కలిపి విచారించే ఆవకాశం!

డీఎస్పీ ప్రణీత్ రావు కాల్ ట్యాపింగ్ కేసులో. పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు అదనపు ఎస్పీలు, ప్రణీత్ రావును కస్టడీకి కోరుతూ పోలీసులు నేడు కస్టడీ పిటిషన్ వేయనున్నారు. ముగ్గురిని కలిపి విచారిస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశముంటుందని భావిస్తున్న అధికారులు.... ఈ మేరకు కస్టడీ కోసం న్యాయస్థానాన్ని కోరనున్నారు. నాగోలు మూసీ వంతెన కింద హార్డ్ డిస్క్ ల భాగాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు... వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఈ కేసులో మొదటి ముగ్గురు నిందితులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న... ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు అంగీకరించారని పోలీసులు తెలిపారు. తర్వాత ప్రణీత్ తో కలిసి ఆధారాలు ధ్వంసం చేసినట్లు చెప్పారని వెల్లడించారు. SIB చీఫ్, మరో ఇద్దరి కోసం లుకౌట్ నోటీసులను ఇప్పటికే జారీ చేశామని........ ఇతర నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, రాధాకిషన్ రావును విచారించాల్సి ఉందని... లుకౌట్ నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.

ఇద్దరి పోలీసుల అరెస్ట్‌

తెలంగాణలో సంచలనం సృష్టించిన SIBలో ఆధారాల ధ్వసం, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో ఇద్దరు అధికారులకు జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించారు. నిందితుడు ప్రణీత్‌ రావు వాంగ్మూలం మేరకు అదనపు SPలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేసిన పోలీసులు.. న్యాయమూర్తి ఎదుట ప్రవేశ పెట్టారు. మరోవైపు కస్టడీ ముగిసిన ప్రణీత్‌ రావును సైతం జడ్జి ముందు హాజరుపరచగా... రిమాండ్‌ పొడగించలేదు. SIB మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ DCPరాధాకిషన్‌రావు, మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్‌ రావులపై లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేశారు.


మరోవైపు ట్యాపింగ్‌ వ్యవహారంలో నిఘా విభాగం మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ DCPరాధాకిషన్‌రావు, మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్‌ రావులపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ప్రణీత్‌ రావు కస్టడీలో చెప్పిన అధికారుల పేర్లతోపాటు ఇంకా ఎవరైనా ఉన్నారేమోననే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఏ చిన్న అనుమానం వచ్చినా పూర్తిస్థాయిలో విచారణ చేస్తూ పోలీసులు ముందుకు సాగుతున్నారు. కస్టడీ విచారణలో ప్రణీత్‌ రావు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినట్లు ఒప్పుకున్నారు. దీంతో SIBలో నోడల్ అధికారి కాకుండా.. ప్రణీత్‌ రావే.. ఫోన్‌కాల్ ను ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సంబంధిత సర్వర్ రూమ్ లోకి కూడా నోడల్ అధికారి కాకుండా ప్రణీత్‌ రావుకు యాక్సెస్ ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఇదంతా చీఫ్‌ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే జరిగినట్లు గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story