Telangana: రిపబ్లిక్ వేడుకలు రద్దు చేసే దుస్థితి వచ్చింది: కిషన్ రెడ్డి
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రభుత్వం నడుస్తోంది

సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో నిజాం పాలన సాగుతోందని ఆరోపించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రభుత్వం నడుస్తోందన్నారు. గవర్నర్‌కు ప్రోటోకాల్ ఇవ్వట్లేదని, ప్రధాని వస్తే కనీసం గౌరవం ఇవ్వరని ద్వజమెత్తారు. తెలంగాణలో గణతంత్ర దినోత్సవ వేడుకలను కూడా రద్దు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో గణతంత్ర వేడుకలను నిర్వహించాలని హైకోర్టు చెప్పాల్సిన దుస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. గణతంత్ర వేడుకలను నిర్వహించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. అభద్రతా భావంలో ఉన్న కేసీఆర్ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
Next Story