Telangana: ఈటల లక్ష్యం అక్కడ నిరవేరడంలేదు: రేవంత్‌రెడ్డి

Telangana: ఈటల లక్ష్యం అక్కడ నిరవేరడంలేదు: రేవంత్‌రెడ్డి
X
ఈటల రాజేందర్‌పై పీసీసీ చీఫ్‌ రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ లక్ష్యం కోసం ఈటల బీజేపీలోకి వెళ్లాడో..అది నెరవేరడం లేదని ఆయన మాటల్లో స్పష్టమైందని తెలిపారు. కేసీఆర్‌ను గద్దె దించాలన్న లక్ష్యంతో ఈటల బీజేపీలో చేరారు అని అన్నారు. అయితే ఆ పార్టీలోకి వెళ్లాక బీజేపీలోనూ కేసీఆర్ ‌కోవర్టులున్నారని ఈటలకు అర్థమైందని వెల్లడించారు. లక్ష్య సాధన కోసం ఈటల ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ నియంతృత్వ ధోరణిని గద్దె దించాలనే లక్ష్యంతో బీజేపీలో చేరిన నేతలు ఇప్పుడా పార్టీలో సంతృప్తిగా లేరని ఆయన వాఖ్యానించారు. బీజేపీ, కేసీఆర్ ఒక్కటేనన్న విషయం ఈటల మాటల్లో స్పష్టమైందని రేవంత్‌ పేర్కొన్నారు.

Tags

Next Story