Telangana : 'హాత్ సె హాత్ జోడో'.. రేవంత్ యాత్ర షురూ..!

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ యాత్రలు జోరందుకుంటున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 'హాత్ సే హాత్ జోడ్' యాత్రను ప్రారంభించారు. శుక్రవారం మదనపల్లి నుంచి దుద్యాల వరకు యాత్ర సాగనుంది. వేరుశనగ పొలంలో పనిచేస్తున్న రైతులతో రేవంత్ మాట్లాడారు. రైతు ఎదుర్కొంటున్న ఖర్చులు, మార్కెట్ అందిస్తున్న ధరను అడిగి తెలుసుకున్నారు.
గురువారం తనసొంత నియోజకవర్గం.. కొడంగల్ పరిధిలోని బొమ్రాస్ పేట్ మండలం మదనపల్లి గ్రామం నుంచి ప్రాదయాత్రను ప్రారంభించారు రేవంత్ రెడ్డి. ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు చేసిన అనంతరం పాదయాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 60రోజుల పాటు గ్రామాల్లో పర్యటిస్తారని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సందేశాన్ని రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి తీసుకెళ్తారని తెలిపారు. "స్వేచ్చ అస్తిత్వపు ముప్పును తెలంగాణ సమాజం ఎదుర్కొంటోంది. ప్రజాస్వామ్యం ప్రమాదకర మార్గంలో ప్రయానిస్తోంది. నిజాం కాలంనాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రం, కేంద్రం రెండూ విషసంస్కృతిని వ్యాప్తి చేస్తున్నాయి" అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

