Telangana: ఉత్తమ వైద్య సేవల్లో మూడో రాష్ట్రం మనదే..

Telangana: ఉత్తమ వైద్య సేవల్లో మూడో రాష్ట్రం మనదే..
ఏడాదిలో జరిగిన అభివృద్ధిపై హరీష్‌రావు నివేదిక

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్‌రావు బాధ్యతలు తీసుకొని నేటితో ఏడాది పూర్తి చేసుకున్నారు. ఏడాదిలో జరిగిన అభివృద్ధిపై ఆయన నివేదిక విడుదల చేశారు. దేశంలోనే ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న మూడో రాష్ట్రంగా తెలంగాణను నీతి అయోగ్ గుర్తించిందని పేర్కొన్నారు. ఏడాదిలో 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయని ఆయన తెలిపారు. త్వరలో మరో 9 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తామన్నారు.

హైదరాబాద్ నలుమూలల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు వరంగల్‌లో మరో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టామని హరీష్‌ వెల్లడించారు. నిమ్స్‌లో బెడ్ల సంఖ్యను 1489 నుంచి 3489కి పెంచేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. కొత్తగా 515 డయాలసిస్ యంత్రాలతో 61 డయాలసిస్ కేంద్రాల మంజూరు చేశామన్నారు. ప్రస్తుతం 22 జిల్లాల్లో టీ డయాగ్నస్టిక్స్ హబ్స్ ఉన్నాయని త్వరలో మరో 13 జిల్లాల్లోనూ అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ఆక్సిజన్ జనరేషన్ సామర్థ్యం రోజుకు 135 ఎంటీ నుంచి 332 ఎంటీకి పెంచామని కేసీఆర్ కిట్ ద్వారా 13.91 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని హరీష్ రావు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story