Telangana: జనగామలో రాజకీయాలు రసవత్తరం

జనగామ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మొత్తం 11 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ జమునపై అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి లంచ్ ఆహ్వానాన్ని కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్లు తిరస్కరించారు. పాత పాలక వర్గం భారీ అక్రమాలు, అవినీతికి పాల్పడిందని సొంత పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తూ ఓ లేఖను విడుదల చేశారు. ఎమ్మెల్యే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. అధికార పార్టీ కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లడంతో బీఆర్ఎస్ నేతలు టెన్షన్ పడుతున్నారు. జనగామ మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అందులో 18 మంది బీఆర్ఎస్, 8 మంది కాంగ్రెస్, నలుగురు బీజేపీ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ఉన్నారు.
మరోవైపు ఎమ్మెల్యే తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అసమ్మతి పై అధిష్టానం సీరియస్‌గా ఉందన్నట్లు సంకేతాలు ఇచ్చారు. అవకాశం ఉన్న చోట భేరసారాలు లేదంటే అభిదృద్ధి పనుల్లో అవకాశాలు కల్పిస్తామని వ్యవహారాన్ని సద్దుమణిచేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఛైర్ పర్సన్ జమున తీరుపై తిరుగుబాటు కౌన్సలర్లు హైదరాబాద్‌లో ఎమ్మెల్యేను కలిసి సమస్యను ఆయన దృష్టి తీసుకు వచ్చారు.ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే నష్ట నివారణ చర్యలు చేపట్టారని గులాబీ శ్రేణులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com