Telangana: మంత్రి మల్లారెడ్డికి అవిశ్వాసాల లొల్లి

Telangana: మంత్రి మల్లారెడ్డికి అవిశ్వాసాల లొల్లి
మేడ్చల్ జిల్లాలో మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేల తిరుగుబాటు

మంత్రి మల్లారెడ్డికి అవిశ్వాసాల లొల్లి వెంటాడుతోంది. ఇప్పటికే ఐటీ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న మల్లారెడ్డి ఆ పరిణామాలతో తలలు పట్టుకుంటున్నారు. మేడ్చల్ జిల్లాలో మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేల తిరుగుబాటు చేస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాల్టీలు ఉండగా ఒక్క తుంకుంట మినహా అన్నింట్లో అవిశ్వాస తీర్మానాలతో తిరుగుబాటు చేస్తున్నారు బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు. పీర్జాదిగూడ, జవహర్ నగర్, బొడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లు, నాగారం, దమ్మాయిగూడా, పోచారం, ఘాట్ కేసర్, గుండ్ల పోచంపల్లి, మేడ్చల్‌లో అవిశ్వాస తీర్మానాలు చేసారు. అవిశ్వాసం పెట్టకుండా కార్పొరేటర్‌కు రూ.15 లక్షలు, కౌన్సిలర్లకు రూ.10 లక్షల ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

జవహర్ నగర్ మేయర్ కావ్యకు వ్యతిరేకంగా అవిశ్వాసం డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్యాంప్‌ రాజకీయం నడుస్తోంది. మొత్తం 28 మంది కార్పొరేటర్ల ఉండగా 20 మంది కార్పొరేటర్లు టూర్‌కు వెళ్లిపోయారు. బొడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్‌లో మేయర్ బుచ్చిరెడ్డిపై కార్పొరేటర్ల తిరుగుబాటు చేశారు. మేయర్ లక్ష్మీ రవి గౌడ్ ఆధ్వర్యంలో తిరుగుబాటు జరిగింది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్‌లోనూ అవిశ్వాసం లొల్లి తారా స్థాయికి చేరింది. పేకాట కేసుల్లో తనను అనవసరంగా ఇరికించారంటున్నారు డిప్యూటి మేయర్ శివ కుమార్. ఇక్కడ మేయర్ వెంకట్ రెడ్డిని డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు మేడ్చల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ను మార్చాల్సిందేనంటూ కౌన్సిలర్లు అవిశ్వీస తీర్మానం చేశారు. ఆయన్ను మార్చకపోతే ముకుమ్మడి గా రాజీనామా చేస్తామని అల్టిమేటం ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story