Telangana: బడ్జెట్‌కు లైన్ క్లియర్

తెలంగాణ బడ్డెట్ సమావేశాల విషయంలో ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఏర్పడిన వివాదానికి తెరపడింది. బడ్జెట్‌ను గవర్నర్ ఆమోదించలేదంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే, రాజ్‌భవన్ తరపు న్యాయవాది అశోక్ ఆనంద్‌లు చర్చలు జరిపి ఓ పరిష్కారానికి వచ్చారు. అసెంబ్లీ సమావేశాలు రాజ్యాంగబద్ధంగా నిర్ణయించేందుకు నిర్ణయించామని కోర్టుకు చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వ తరపు న్యాయవాది దవే హైకోర్టుకు చెప్పారు. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ సహకరిస్తారని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఇరువైపు న్యాయవాదుల సమ్మతితో హైకోర్టు విచారణ ముగిసింది.
2023-24 బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా దానికి గవర్నర్ తమిళి సై ఇంకా ఆమోదం తెలపలేదు. దీంతో అధికార వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మరో నాలుగు రోజులు సమయం మాత్రమే ఉండడంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ సమ్మతి తర్వాతే బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదిస్తుంది. తర్వాత శాసనసభ, మండలిలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ముసాయిదా బడ్జెట్ ప్రతులను మూడు రోజుల క్రితమే ప్రభుత్వం గవర్నర్ ఆఫీసుకు పంపించింది. ఐతే ఇప్పటివరకూ గవర్నర్ ఆమోదం తెలవకపోవడంతో సందిగ్ధత ఏర్పడింది. దీంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఇరువర్గాలు సయోధ్యకు రావడంతో బడ్జెట్ సమావేశాలకు లైన్ క్లియర్ అయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com