Telangana: మరోమారు పొంగులేటి హాట్ కామెంట్స్

ఇప్పటికే సొంతపార్టీపై గుర్రుమీదున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్‌ఎస్‌పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు . ఖమ్మం జిల్లా బోనకల్లులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన హాట్ కామెంట్స్ చేశారు. నాడు కేసీఆర్, కేటీఆర్ మాటలు నమ్మి గులాబీ పార్టీలో చేరానని అయితే పోటీలో ఉన్న అభ్యర్థులను తాను ఓడించానని నిందలేశారని అన్నారు. సీటు తనకు కాదని వేరే వారికి ఇచ్చారని భగ్గుమన్నారు. ఏడున్నరేళ్లుగా తన అభిమానులను అధికారంలో ఉన్న నాయకులు ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. 2018లో మధిర అభ్యర్ధి గెలుపు కోసం పల్లె నిద్రలు చేశానని గుర్తు చేశారు. ఏ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ హామీలు నెరవేరాయా? లేదో? ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటాం ఢీకొడతామన్నారు పొంగులేటి. అధికారం ఎవరి సొత్తు కాదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com