Telangana: బడ్జెట్ సమావేశాల నిర్వహణపై సీఎం కేసీఆర్ రివ్యూ మీటింగ్‌

Telangana: బడ్జెట్ సమావేశాల నిర్వహణపై సీఎం కేసీఆర్ రివ్యూ మీటింగ్‌
సమావేశాల నిర్వహణ, గవర్నర్ ప్రసంగం, బడ్జెట్‌ ప్రవేశపెట్టే తేదీ, సంబంధిత అంశాలపై నిర్ణయం తీసుకోనున్న సీఎం కేసీఆర్

బడ్జెట్ సమావేశాల నిర్వహణ విషయమై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు, అధికారులతో రివ్యూ చేస్తున్నారు. ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రులు హరీష్‌ రావు, ప్రశాంత్ రెడ్డి, అధికారులు సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. సమావేశాల నిర్వహణ, గవర్నర్ ప్రసంగం, బడ్జెట్‌ ప్రవేశపెట్టే తేదీ, సంబంధిత అంశాలపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశం ముగిసిన తర్వాత గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ తేదీలను సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు.

అసెంబ్లీని ప్రోరోగ్ చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీని ప్రోరోగ్‌ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి గవర్నర్‌ కార్యాలయానికి సమాచారం ఇవ్వనున్నారు. తర్వాత గవర్నర్‌ స్పీచ్‌కు ఆమోదం తెలుపుతూ రాజ్‌భవన్‌కు పంపనుంది. ప్రోరోగ్ తర్వాత కొత్త తేదీలను ప్రకటించనున్నారు. గవర్నర్ ప్రసంగం ఉంటుందన్న ప్రభుత్వ తాజా నిర్ణయంతో సమావేశాల షెడ్యూల్లో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంది.

Tags

Next Story