Telangana: పోడు రైతులకు పట్టాలు

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పోడు భూముల వ్యవహరంపై దూమారం కొనసాగుతుంది. తమకు న్యాయం చేయాలంటూ పోడు రైతులు రోడ్డెక్కుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి నుంచి అర్హులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి సత్యవతి రాథోడ్ అధికారిక ప్రకటన చేశారు.
అర్హులందరికీ పోడు భూములు పంపిణీ చేస్తామని ఆమె తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. సీఎస్ శాంతికుమారితో కలిసి అన్ని కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సత్యవతి పోడు భూములు, కంటి వెలుగు, మన ఊరు- మనబడి, పామాయిల్‌తో పాటు పలు అంశాలపై సమీక్షించారు. పోడు భూముల సమస్యకు సంబంధించి సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో వంద శాతం సర్వే, గ్రామసభలు పూర్తి చేశామని చెప్పారు. ఫిబ్రవరిలో పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com