Telangana: వసుధ ఫార్మాలో ఐటీ సోదాలు

మంగళవారం తెల్లవారు జాము నుంచి హైదరాబాద్‌తో సహా తెలంగాణలో పలు చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఏక కాలంలో 40 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వసుధ ఫార్మా కెమ్‌తో పాటు పలుచోట్ల ఐటీ రైడ్స్ నిర్వహిస్తుంది. ఐటీ శాఖ 50 టీం లతో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. వసుధ ఫార్మా ఛైర్మన్ రాజు, డైరక్టర్ల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. వసుధ గ్రూప్ ఫార్మాతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తోంది. 15 కంపెనీల పేరుతో వసుధ ఛైర్మెన్ రాజు రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో వసుధ గ్రూప్‌కు ఆస్తులు, పెట్టుబడులు ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. అయితే వాటిని లెక్కల్లో చూపకపోవడంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ తో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. వసుధ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల పై ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు. ఫార్మా కంపెనీకి చెందిన కార్పొరేట్ కార్యాలయాలు, చైర్మన్ ఇళ్ళు, డైరెక్టర్ల ఇళ్ళల్లో అధికారులు తనిఖీలు చేస్తుండడంతో ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ వెంగళరావు నగర్ లో రెండు టీమ్ లు, మాదాపూర్ లోని మరో కార్పొరేట్ కార్యాలయంలో నాలుగు టీమ్ లు సోదాలు జరుపుతున్నాయి. ఫార్మా కంపెనీ నుంచి వచ్చిన లాభాలను రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారన్న సమాచారంతో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com