Telangana: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మళ్లీ నోటీసులు

Telangana: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మళ్లీ నోటీసులు
X
ముంబై ర్యాలీలోమతపరమైన వ్యాఖ్యలు చేశారని మంగళహాట్‌ పోలీసులు నోటీసులు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. ముంబై ర్యాలీలోమతపరమైన వ్యాఖ్యలు చేశారని మంగళహాట్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అతని వ్యాఖ్యలపై రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. అయితే మహారాష్ట్రలో మాట్లాడితే మంగళహాట్‌ పోలీసులు నోటీసులు ఇవ్వడమేంటని రాజాసింగ్‌ ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు రాజాసింగ్‌పై పీడీయాక్ట్ నమోదు చేశారు. ఈ కేసులో షరతులతో కూడిన బెయిల్‌పై ఇటీవలే రాజాసింగ్ విడుదలయ్యారు. మళ్లీ మతపరమైన వ్యాఖ్యలు చేయడంతో నోటీసులు జారీ చేశామని పోలీసులు పేర్కొన్నారు.

Tags

Next Story