Telangana: స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..

X
By - Vijayanand |31 Jan 2023 12:29 PM IST
చిన్నారులకు గాయాలు; భయభ్రాంతులకు లోనై హాహాకారు; చూపరులను కలచివేస్తున్న చిన్నారుల రోదనలు....
ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును టీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్లజిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలో జరిగింది. ఈ ప్రమాదంలో 30మందికి గాయాలవగా, అందులో 20మంది విద్యార్థులకు,10మంది బస్సు ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సు ప్రమాదంతో పిల్లలు తీవ్ర భయానికి లోనయ్యారు. గాయపడిన పిల్లలకు రక్తమోడగా, ఆ బాధకు విలవిలలాడి పోయారు. గాయాలయిన పిల్లలను చూసిన తోటి పిల్లల ఏడుపు ఆకాశాన్నంటింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు.
కామారెడ్డి నుంచి సిరిసిల్లా వైపుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనక నుంచి స్కూల్ బస్సును ఢీకొంది. ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడిన ఆయన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com