Telangana: 'మన ఊరు మన బడి' కేసీఆర్ మానస పుత్రిక

Telangana: మన ఊరు మన బడి కేసీఆర్ మానస పుత్రిక
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఉచిత విద్య

మన ఊరు మన బడి కార్యక్రమం కేసీఆర్ మానస పుత్రిక అని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేజీ టూ పీజీ క్యాంపస్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పేదలకు ఉచిత విద్య అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వెయ్యి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. 75ఏళ్లలో జరగని అభివృద్ధిని కేసీఆర్ అధికారంలోకి వచ్చాక చేసి చూపించారనన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఇక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి భోజనం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story