Telangana: నందికొండ మున్సిపల్ ఛైర్‌పర్సన్ పై అవిశ్వాం

ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపాలిటీల్లో పుట్టిన ముసలం అవిశ్వాసాల దిశగా కొనసాగుతోంది. ఇటీవలే చండూరు, యాదాద్రి, ఆలేరు మునిసిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు ఇవ్వగా తాజాగా నందికొండ మున్సిపాలిటీలో అసమ్మతి సెగలు చలరేగాయి. ముందునుంచే నందికొండలో అసమ్మతులు, వర్గపోరు ఉంది. అధికార పార్టీకి చెందిన ఛైర్‌పర్సన్ అనూష కుటుంబ సభ్యులు అన్నివిషయాల్లో జోక్యం చేసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు కౌన్సిలర్లు ఏమి చెప్పినా పట్టించుకోవడంలేదని, వారి వార్డుల్లో సమస్యలు తీర్చుకునేందుకు కనీస నిధులు కేటాయించడం లేదని మండిపడుతున్నారు. దీంతో నందికొండ అభివృద్ధి కుంటు పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిపై విసుగు చెందిన కౌన్సిలర్లు బుధవారం అధికార పార్టీకి చెందిన ఛైర్‌పర్సన్ అనూషపై సొంతపార్టీకి చెందిన కౌన్సిలర్లతోపాటు ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ.. జిల్లా అదనపు కలెక్టర్‌ను కలిసి నోటీసు ఇచ్చారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లలో ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్మన్ మినహా మిగతా వారంతా అవిశ్వాస తీర్మానానికి ప్రతిపాదించారు. వీరికి ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు మద్దతు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com