Telangana: సమతామూర్తి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో సమతా కుంభ్- 2023 బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి 14వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ వేడుకలు జరగుతున్నాయి. సువర్ణమూర్తి భగవద్రామానుజులకు ఉత్సవారంభ స్నపనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విశ్వక్సేన వీధి శోధన నిర్వహిస్తారు. 1.30 గంటలకు తీర్థ ప్రసాద గోష్ఠి, సాయంత్రం 5 గంటల నుంచి 45 నిమిషాలపాటు సామూహిక విష్ణు సహస్రనామ స్త్రోత్ర పారాయణం నిర్వహిస్తారు. ఇక సాయంత్రం ఆరు గంటల నుంచి 8.30 గంటల వరకు అంకురార్పణ వైనతేయ ప్రతిష్ఠ, తీర్థ ప్రసాద గోష్టి ఉంటుంది. వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com