Telangana: రాజా బహదూర్ స్వప్నం సాకారం చేస్తాం

Telangana: రాజా బహదూర్  స్వప్నం సాకారం చేస్తాం
X
రాజా బహదూర్ వెంకట్రామ్ రెడ్డి వసతి గృహానికి భూమి పూజ చేసిన మంత్రులు

రాజా బహదూర్ వెంకట్రామ్ రెడ్డి స్వప్నం సాకారం చేస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. రాజేంద్రనగర్‌ పరిధిలోని మానస హిల్స్‌లో రాజా బహదూర్ వెంకట్రామ్ రెడ్డి వసతి గృహానికి మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. 15 ఎకరాల్లో 10కోట్ల రూపాయల వ్యవయంతో వసతి గృహం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇక అంతర్జాతీయ ప్రమాణాలతో రాజా బహదూర్ వెంకట్రామ్‌ రెడ్డి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రులు తెలిపారు. ఈ సందర్భంగా రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి సేవలను కొనియాడారు.

Tags

Next Story