Telangana: అక్క మజాక్ చేస్తోందిలే....!

సీఎం కేసీఆర్‌కు YSRTP అధ్యక్షురాలు షర్మిల సవాల్ విసిరారు. కేసీఆర్‌కు దమ్ముంటే ఒక్కరోజు పాదయాత్ర చేయాలన్నారు. కేసీఆర్‌కు బూట్లు సిద్ధంగా ఉన్నాయంటూ కొత్త బూట్లను చూపించారు షర్మిల. తనతో పాదయాత్ర చేసి సమస్యలు లేవని కేసీఆర్ చెప్పాలన్నారు. తెలంగాణలో సమస్యలు లేవంటే రాజకీయాలు వదిలేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్కరోజైనా ప్రజాదర్బార్ ఉందా అని ప్రశ్నించారు. ఉద్యమకాలంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుండా కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. పాదయాత్ర ఆగిన చోటు నుంచే మళ్లీ మొదలుపెడతానని షర్మిల తెలిపారు. లా అండ్ ఆర్డర్ సాకుతో పాదయాత్రను కేసీఆర్ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 3 వేల 500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసానని చెప్పారు. పాదయాత్రలో బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలను ఎండగడతానని షర్మిలా స్పష్టంచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com