Telangana : బడ్జెట్‌ సమావేశాలకు బీజేపీ రెడీ

Telangana : బడ్జెట్‌ సమావేశాలకు బీజేపీ రెడీ
ఎమ్మెల్యే రాజా సింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ కొనసాగుతుండటంతో.. ఈటల రాజేందర్, రఘునందన్ రావు బీజేపీ తరుపున సభకు హాజరుకానున్నారు

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలకు బీజేపీ రెడీ అవుతుంది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సభలో గళం విప్పుతామని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీ బలం రెండుకు పడిపోయింది. ఎమ్మెల్యే రాజా సింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ కొనసాగుతుండటంతో.. ఈటల రాజేందర్, రఘునందన్ రావు బీజేపీ తరుపున సభకు హాజరుకానున్నారు. ఇక ప్రజా సమస్యలపై సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ నేతలు చెప్పారు. మరోవైపు గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ సభకు హాజరువుతానని తెలిపారు. నియోజకవర్గ సమస్యలు సభలో ప్రస్తావిస్తానన్నారు. అయితే సభలో రాజాసింగ్ స్వతంత్రంగా వ్యవహరించనున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలైన ఈటల, రఘునందన్ రావుతో రాజాసింగ్ కూర్చుంటారా లేదా అనేది ఉత్కంఠగా మారింది.

Tags

Next Story