Telangana : "అలజడులు సృష్టించేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంది"

Telangana : అలజడులు సృష్టించేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంది
సీఎం కేసీఆర్ సంపద సృష్టిస్తుంటే కేంద్రం అమ్మడానికి ప్రయత్నిస్తోంది: కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే


రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని అన్నారు బీఆర్ఎస్ నాయకులు, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద. రాష్ట్రంలో వ్యాపారాలు జరగకుండా ఐటీ దాడులు చేస్తున్నారని, అభివృద్ధిలో తెలంగాణ పురోగమిస్తుంటే ఐటీ, ఈడీలతో అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. అదానీ సంస్థలపై ఐటీ, ఈడీ దాడులు ఎందుకు చేయరని, ప్రధాని జేబు సంస్థలు అయితే దాడులు చేయరా అని ప్రశ్నించారు. పాలు, పూలు అమ్మి కాలేజ్‌లు పెడితే ఐటీ దాడులు చేస్తున్నారని ఐటీ దాడులపై ప్రత్యేక చర్చ జరగాలన్నారు ఎమ్మెల్యే వివేకానంద.

సీఎం కేసీఆర్ సంపద సృష్టిస్తుంటే కేంద్రం అమ్మడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. కేసీఆర్ లక్షాలు దేశం మొత్తం విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. రాష్ట్రంలో, ఐటీ రంగంలో 2 లక్షల 55వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అన్నారు. దాదాపు 7 లక్షల మందికి పరోక్షంగా ఉపాది లభించిందని వివరించారు.

Tags

Next Story