Telangana : బరాబర్ మాది కుటుంబ పాలనే : మంత్రి కేటీఆర్

Telangana : బరాబర్ మాది కుటుంబ పాలనే : మంత్రి కేటీఆర్
రాష్ట్రం మొత్తం మా కుటుంబమేనని, 4 కోట్ల మంది ప్రజలు తమ కుటుంబ సభ్యులేనని అన్నారు


రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతుందన్న విపక్షాలకు మంత్రి కేటీఆర్ ఘాటుగా సమాదానమిచ్చారు. అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడిన ఆయన... విపక్షాలు మాట మాట్లాడితే కుటుంబపాలన అంటారని అన్నారు. అవును తమది నిజంగానే కుటుంబ పాలననే అని సభాముఖంగా చెప్పారు కేటీఆర్. రాష్ట్రం మొత్తం మా కుటుంబమేనని, 4 కోట్ల మంది ప్రజలు తమ కుటుంబ సభ్యులేనని అన్నారు. ఈ కుటుంబానికి పెద్ద కేసీఆర్ అని తెలిపారు. బరాబర్ మాది కుటుంబ పాలనే అని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని ప్రతీ అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చి కుటుంబ పెద్దగా కేసీఆర్ నిలబడ్డారని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అంటూ 2 లక్షల మంది ఆడబిడ్డలకు మేనమామలా పెళ్లిల్లు చేశారని, నాలుగు కోట్ల మంది తోబుట్టువులను దగ్గరుండి కేసీఆర్ చూసుకుంటున్నరని, కంటి వెలుగుతో వృద్ధుల జీవితాలకు కొత్త వెలుగునిస్తున్నది, గురుకులాలు, మెడికల్ కాలేజీలతో లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు కేటీఆర్. మరోసారి తమది నిజంగానే కుటుంబపాలన అని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story