Telangana: ఘనంగా లిగమంతుల జాతర

Telangana: ఘనంగా లిగమంతుల జాతర
X
కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

తెలంగాణలోనే రెండో అతి పెద్ద జాతర శ్రీలింగమంతుల స్వామి జాతర ఘనంగా ఆరంభమైంది. కేసారం గ్రామంలో లింగమంతుల స్వామి దేవర పెట్టకు పూజలు చేసి పెద్దగట్టుకు తరలించే ప్రక్రియను సోమవారం మంత్రి జగదీష్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడంతో జాతర ప్రక్రియ మొదలైయ్యింది. ఓ లింగా నామస్మరణతో పెద్దగట్టు మారుమ్రోగుతోంది. లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించు కునేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుండి సైతం తరలివస్తున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు.

Tags

Next Story