Telangana: నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ తప్పదు

నకిలీ విత్తనాలు అమ్మినట్టు తేలితే పిడి యాక్ట్ నమోదు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. శాసన సభలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. ఆయిల్‌ఫామ్ విత్తనాలు మొలవాలంటే చాలా సమయం పడుతుందన్నారు. ఆయిల్‌ఫామ్ విత్తనాలకు అనేక దేశాలలో డిమాండ్ ఉందన్నారు. ఆయిల్‌ఫామ్ సాగుకు తెలంగాణ నేలలు అనువుగా ఉన్నాయని, నర్సరీల క్వాలటీని హార్టికల్చర్ శాఖ ఎప్పటికప్పుడు చెక్ చేస్తుందన్నారు. ఆయిల్‌ఫామ్ సాగు కోసం ఎవరు అప్లయ్ చేసుకున్నా సబ్సిడీలు ఇస్తున్నామన్నారు. నూనె ఉత్పత్తిలో వేరు శనగలది కీలక పాత్ర అని, ఉమ్మడి పాలమూరు జిల్లాలో పండే శనగలు నాణ్యమైనవని ఇక్రిశాట్ వాళ్లే చెప్పారని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. వేరుశనగ పరిశోధన కేంద్రాన్ని వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేసుకోబోతున్నామని ఆయన వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com