Telangana: కట్నం వేధింపులు భరించలేక కమిషనర్ భార్య ఆత్మహత్య

అదనపు కట్నం కోసం ఓ అధికారి కుటుంబం వేధింపులు భరించలేక మంచిర్యాలలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ నల్లమల బాలకృష్ణ భార్య జ్యోతి చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. జ్యోతి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు, బంధువులు కోపోద్రిక్తులయ్యారు. బాలకృష్ణ కానిస్టేబుల్‌గా ఉన్నప్పుడు వివాహ సమయంలో రెండు లక్షల రూపాయల నగదు కోటి రూపాయల విలువైన మూడెకరాల భూమి కట్నంగా ఇచ్చామని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ అయ్యాక ఐదు కోట్ల రూపాయలు అదనంగా తీసుకురావాలంటూ జ్యోతిని భర్తతో పాటు అత్త, మరిది వేధిస్తున్నారని తెలిపారు. ఇటీవలే ఆయనకు ఎకరం పొలం కూడా రాసిచ్చామన్నారు. ఐనా వేధింపులు ఆపలేదన్నారు. కొందరు నేతలు కమిషనర్ బాలకృష్ణను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com