Telangana: కేంద్రంపై మంత్రి హరీష్ పవర్‌ఫుల్ పంచ్

కేంద్ర బీజేపీపై తెలంగాణ మంత్రి హరీష్‌రావు పవర్‌ఫుల్ పంచ్‌లు విసిరారు. అసెంబ్లీ వేదికగా బీజేపీ విజయాలను, ఘనతను తనదైన స్టైల్‌లో కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ఏది చూసినా ఢోకానే అంటూ పంచ్ డైలాగులతో మోదీ సర్కారుపై మాటల తూటాలు పేల్చారు హరీష్‌రావు.
ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చడంలో బీజేపీ సక్సెస్ అయిందని మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. అదానీ ఆస్తులను పెంచడంలో, ప్రతిపక్షాలపై ఈడీ, ఐటీ దాడులు చేయించడంలో జీడీపీని మంటగలపడంలో చివరికి చిన్నపిల్లలు తాగే పాలపైనా జీఎస్టీ వేయడంలో బీజేపీ డబుల్ సక్సెస్ అయిందని హరీష్‌రావు విరుచుకుపడ్డారు.
బీజేపీ 8 ఏళ్ల పాలనలో మోదీ ఘనతను అసెంబ్లీ సాక్షిగా మంత్రి హరీష్‌రావు వివరించారు. యాస, ప్రాస కలిపి బీజేపీ లో అండ్ హైలను తనదైన శైలిలో చెప్పారు. పెట్రోల్ డీజీల్ రేటు, కరెప్షన్, ద్రవ్యోల్బణం, పేదరికం, నిత్యావసర ధరలు, నిరుద్యోగం ఇలా అన్ని హై.. హైలే అంటూ అసెంబ్లీ సాక్షిగా బీజేపీ గొప్పదనాన్ని బయటపెట్టారు మంత్రి హరీష్‌రావు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com