Telangana: బీఆర్ఎస్ ప్రభుత్వమే టార్గెట్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రతో ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్‌గా విమర్శనాస్రాలు సందిస్తూ ముందుకు వెళుతున్నారు. డోర్నకల్ నియోజక వర్గం పెద్ద నాగారం నుంచి రేవంత్ యాత్ర ప్రారంభించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ముందుకు వెళుతున్న రేవంత్ రెడ్డికి సమస్యలపై ప్రజలు వినతి పత్రాలు ఇస్తున్నారు . ఇంకా జీతాలు పడలేదంటూ ఉద్యోగులు రేవంత్ ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు . అలాగే మోడల్ స్కూల్ ఉద్యోగుల సమస్యల సరిష్కారానికి కృషి చేయాలని వినతి పత్రం అందించారు. నాగారం గోప తండాలో మిర్చి రైతుల సమస్యలను తెలుసుకున్నారు రేవంత్ రెడ్డి క్వింటాకు 22వేలు గిట్టుబాబు ధర కల్పించేలా చూడాలని రైతులు రేవంత్ ను కోరారు.
మరోవైపు తెలంగాణలో ఉద్యోగులు ఎవరూ సంతోషంగా లేరన్నారుఅప్పుల బాధతో 29 మంది రైతులు పురుగుల మందు తాగి చనిపోయారు.. నకిలీ విత్తనాలతో రైతులను మోసగించిన వారిపై పీడీ యాక్ట్ ఎందుకు పెట్టరు? జనవరి 1, 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పోడు భూములకు పట్టాలిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హాథ్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర 4వ రోజు పాదయాత్రలో ప్రజలు తనతో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన బంజరా మహిళలతో కలసి కాసేపు డ్యాన్స్ చేసి రేవంత్ కేడర్‌లో జోష్ పెంచారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com