Telangana: రేవంత్‌పై నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్

అసెంబ్లీలో కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్ భగ్గుమన్నారు. ధరణి రైతులకు శాపంగా మారిందని కొందరి ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని శ్రీధర్ బాబు మండిపడ్డారు. ధరణిని రద్దు చేయాల న్నదే తమ నినాదమన్నారు. దీంతో శ్రీధర్ బాబు వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ధరణిపై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. లోపాలు ఉంటే సరి చేస్తాం కానీ ధరణిని మొత్తం తొలగించబోమన్నారు. అంతేకాదు ప్రగతి భవన్‌ను పేలుస్తామంటున్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఏవిధంగా చూడాలన్నారు. ఇలా మీ అధ్యక్షుడు మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్ అంటూ శ్రీధర్ బాబును కేటీఆర్ ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. రేవంత్ దోస్తానాతో భట్టి, శ్రీధర్‌బాబు కరాబ్ అయ్యారని,కాంగ్రెస్ పీసీసీ ఆర్టీఐ పేరుతో దందా చేస్తున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో కోట్ల రూపాయలు వసూలు చేశారని రిటైర్డ్ ఆఫీసర్లతో రేవంత్‌రెడ్డి తతంగం నడిపిస్తున్నారని ఆరోపించారు. దీంతో ధరణికి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. దీంతో పాటు ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా రోడ్లకు అడ్డంగా ఉన్న గుడి, మసీదు, చర్చిలను తొలగించేందుకు చట్టం తెస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. అలాగే రోడ్ల మధ్య ఉన్న వాటిని మరో చోట నిర్మిస్తామని పేర్కొన్నారు. గ్రేటర్ సిటీ ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు మొదలుపెట్టి అమలు చేస్తోందన్నారు. ఆర్మీ జోన్ ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కేంద్రాన్ని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com