Telangana: ఈ నెలాఖరు నుంచి పోడు భూముల పంపిణి

ఈ నెలాఖరు నుంచి పోడు భూములు పంపిణి చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు . పోడు భూములపై అనవసర రాద్దాంతం చేస్తున్నారన్నారు . పోడు భూములు గిరిజనుల హక్కు కాదని,అటవీ సంపద కాపాడాలని అన్నారు. నాశనం అయిన అడవుల పునరుజ్జీవన ప్రక్రియ పెంచే ప్రయత్నం చేస్తున్నామని సీఎం అన్నారు.
పోడు భూములపై ప్రభుత్వానికి చిత్త శుద్ది వుందని కేసీఆర్ తెలిపారు. పట్టాలు తీసుకున్నవారికి రైతు బంధు కూడా ఇస్తామన్నారు. భూమి లేని వారికి గిరిజన బంధు కూడా ఇస్తామని తెలిపారు. పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ఆలోచన చేస్తుందని, రాష్ట్రంలో దాదాపు 66లక్షల ఎకరాలు ఉన్నాయన్నారు. వీటిపై అన్ని స్టేజీల్లో సర్వేలు జరిగాయని తెలిపారు. అయితే ఇప్పటికిప్పుడు పోడు భూముల పంపిణీ చేయబోమని, అడవులు నరకమని హామీ ఇస్తేనే పోడు భూములు ఇస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com