Telangana: కురవి మండలంలో క్షుద్రపూజల కలకలం

Telangana: కురవి మండలంలో క్షుద్రపూజల కలకలం
X
సూదనపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజలు

మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలంలో క్షుద్రపూజల కలకలం రేగింది. సూదనపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో తరగతి గదుల తలుపులు ధ్వంసం చేసి ఈ పూజలు నిర్వహించినట్లు సమాచారం. ఉదయం క్లాస్‌రూమ్‌కి వెళ్లి విద్యార్థులు పూజలను చూసి భయంతో బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు క్షుద్రపూజలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags

Next Story