Telangana: ఒవైసీ కళ్లలో ఆనందం కోసమే సెక్రటేరియట్ డిజైన్

బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సచివాలయం డోమ్‌లు కూల్చేస్తామంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం సంచలన కామెంట్లు చేశారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కళ్లలో ఆనందం కోసమే సెక్రటేరియట్‌ను తాజ్ మహల్ నమూనాలో కట్టారని విమర్శించారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో భాగంగా బోయిన్‌పల్లిలో మాట్లాడారు బండి సంజయ్.
ప్రస్తుత సచివాలయం భారతీయ సంస్కృతికి అనుగుణంగా లేదని. మేం అధికారంలోకి వచ్చాక భారతీయ సంస్కృతికి అనుగుణంగా సెక్రటేరియట్‌ను మార్పులు చేస్తామన్నారు. కేటీఆర్ రోడ్డుపక్కన ఉన్న గుడులు, మసీదులు కూల్చుతామంటున్నారు.దమ్ముంటే ఓల్డ్ సిటీ నుంచే కూల్చుడు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం అవినీతి,కుటుంబ పాలనపై ప్రజలోకి కార్నర్ మీటింగ్ ల ద్వారా తీసుకెళ్తామన్నారు. ప్రస్తుతం ప్రజలను పట్టించుకునే పరిస్థితిలో కేసీఆర్ లేరని. ప్రశ్నిస్తే జైల్లో పెడతామని హెచ్చరిస్తున్నారని బండి సంజయ్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com