Telangana: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ వడ్డెర కులస్తులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్ చేరుకున్న వడ్డెర కుల ప్రతినిధులు విడతల వారీగా అసెంబ్లీ వైపు దూసుకొచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ తమను ఎస్టీల జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చారని, దానిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అసెంబ్లీ పరిసరాల్లోకి ఎవరూ రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. విడతల వారీగా మెరుపులా అసెంబ్లీ వైపు దూసుకువస్తున్నారు నిరసన కారులు. మరోవైపు ఫిషర్ మెన్లు కూడా అసెంబ్లీ ముట్టికి యత్నించారు. ఫిషర్‌మెన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి దూసుకువచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com