Telangana: శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండ ప్రకాశ్ ఏకగ్రీవం

X
By - Subba Reddy |12 Feb 2023 3:15 PM IST
బండ ప్రకాశ్‌ను అభినందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించి చైర్‌లో కూర్చోబెట్టారు
శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. దీంతో బండ ప్రకాశ్‌ను అభినందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించి చైర్‌లో కూర్చోబెట్టారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ గతంలో బండ ప్రకాశ్ విద్యార్థిగా ఉంటూనే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారని తెలిపారు. ఇప్పుడు కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టడం గర్వకారణమన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com