Telangana: బీజేపీ ఆఫీసును ముట్టడించిన ఆమ్ ఆద్మీ నేతలు

Telangana: బీజేపీ ఆఫీసును ముట్టడించిన ఆమ్ ఆద్మీ నేతలు
అదానీ మెగా స్కామ్‌పై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్‌

హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతల యత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కార్యాలయం వైపు దూసుకొచ్చిన ఆప్ నేతలను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ ఆఫీస్ ముందు టెన్షన్ వాతావరణం నెలకొంది. మోదీ పాలన అవినీతి మయమని ఆప్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐలను ప్రయోగించి వేధిస్తున్నారని మండిపడ్డారు. అదానీ మెగా స్కామ్‌పై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోర్ కమిటీ సభ్యుడు సుధాకర్ డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Tags

Next Story