Telangana : యాదాద్రి తరహాలో కొండగట్టు నిర్మాణం

Telangana : యాదాద్రి తరహాలో కొండగట్టు నిర్మాణం
108 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు చెప్పారు

కొండగట్టు క్షేత్రాన్ని అభివృద్ధిని చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు యాదాద్రి ఆర్కిటెక్ ఆనంద్ సాయి కొండగట్టు ఆలయాన్ని దర్శించారు. ముందుగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మీడియాతో మాట్లాడిన ఆనంద్ సాయి.. యాదాద్రి తరహాలో కొండగట్టును అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ తలంచినట్లు చెప్పారు. కొండగట్టులో అవసరమున్నపనులను గుర్తించి రిపొర్ట్ పంపాలని తెలిపారు.

రానున్న 3,4 రోజుల్లో సీఎం కేసీఆర్ కొండగట్టుకు రానున్నారని ఆనంద్ సాయి తెలిపారు. 108 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెప్పారు. అన్ని వైపుల నుంచి ఆంజనేయస్వామి విగ్రహం కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వాటర్, ఎలక్ట్రికల్ సదుపాయాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం జగిత్యాల జిల్లా కొండగట్టు కు సీఎం కేసీఆర్ వస్తున్న సంద్భంగా కలెక్టర్ ఆద్వర్యంలో జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి బడ్జెట్ లో రూ. 100కోట్లు ప్రవేశపెట్టడంతో ఆలయ మాస్టర్ ప్లాన్ పైనా సమీక్ష నిర్వహించారు.

Tags

Next Story