Telangana: అప్పుల కుప్పగా తెలంగాణ

తెలంగాణ అప్పుల కుప్పగా మారుతోంది. ప్రతి ఏటా వేల కోట్లకు పెరుగుతున్నాయి తెలంగాణ అప్పులు. రాష్ట్రం ఏర్పడిన 2014 నాటికి తెలంగాణ అప్పు 75వేల 577 కోట్లు. అయితే 2022 నాటికి అప్పులు 2లక్షల 83వేల 452 కోట్లకు చేరాయి. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నకు రాతపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ వివరాలు వెల్లడించింది. ప్రభుత్వం చేస్తున్న అప్పులే కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు, సంస్థల నుండి అదనంగా వేల కోట్ల అప్పులు చేస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్లు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు. నాబార్డ్ నుంచి రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటి వరకు 7వేల 144 కోట్ల రుణాలు ఇచ్చారు.
వేర్ హౌజింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద నాబార్డ్ నుంచి ఇప్పటి వరకు 85వేల 227 కోట్ల రుణాలు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు. నాబార్డ్ నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ ఫండ్ కింద సుమారు వెయ్యి కోట్ల రుణం తీసుకుంది తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ కింద నాబార్డ్ నుండి తెలంగాణ ప్రభుత్వ కార్పొరేషన్లకు 11వేల 424 కోట్ల రుణాలు ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com