Telangana: టీచర్ల బదిలీలు వేసవి సెలవుల్లోనే

తెలంగాణలో టీచర్ల బదిలీలు వేసవి సెలవుల్లోనే జరిగే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో టీచర్ల బదిలీపై హైకోర్టు స్టే విధించింది. మార్చి 14 వరకు టీచర్లను బదిలీ చేయొద్దంటూ స్టే జారీ చేసింది. నాన్ స్పౌజ్ టీచర్ల అసోసియేషన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. టీచర్ల బదిలీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయంటూ పిటిషనర్లు పేర్కొన్నారు. దాంతో ట్రాన్స్‌ఫర్‌పై స్టే ఇచ్చిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. టీచర్ల బదిలీల కోసం. గత నెల 25న జారీ చేసిన జీవో 5, దానికి సవరణలు చేస్తూ ఈ నెల 7న జారీ చేసిన జీవో 9ల అమలును నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు ధర్మాసనం.
ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఐదుగురు ఉపాధ్యాయులు హైకోర్టులో సవాల్ చేశారు. జీవోలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయని పిటిషనర్ల తరుపు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదించారు చట్టప్రకారం నిబంధనలు రూపొందించే అధికారం అధికారులకు ఉండదని, చట్టసభలకు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. గవర్నర్ అనుమతి లేకుండా నిబంధనల రూపకల్పన చేయడం చెల్లదని వాదనలు వినిపించారు. అయితే దీనికి చట్ట సభల అనుమతి అవసరం లేదని వాదనలు విపించారు ప్రభుత్వ న్యాయవాది. ఇరుపక్షాల వాదనల అనంతరం టీచర్ల బదిలీపై స్టే విధించింది హైకోర్టు. తదుపరి విచారణ మార్చి 14కు వాయిదా వేసింది .
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com