Telangana: ఠాక్రేతో కోమటిరెడ్డి భేటీ

Telangana: ఠాక్రేతో కోమటిరెడ్డి భేటీ
తన వ్యాఖ్యలపై ఠాక్రేకు ఎంపీ కోమటిరెడ్డి వివరణ

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి భేటీ అయ్యారు. మంగళవారం కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ భేటీకి ఈ ప్రాధాన్యం సంతరించుకుంది. తన వ్యాఖ్యలపై ఠాక్రేకు ఎంపీ కోమటిరెడ్డి వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోమటిరెడ్డి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు కోమటిరెడ్డి వ్యాఖ్యల వీడియోను మాణిక్ రావు ఠాక్రే ఇప్పటికే పరిశీలించారు. కోమటిరెడ్డి వివరణ తర్వాత ఏఐసీసీకి ఠాక్రే రిపోర్టు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story