Telangana: బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు ఖాయం

Telangana: బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు ఖాయం
కేసీఆర్‌తో కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం చేసుకుంది

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు ఖాయమైందన్నారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. గులాబీ, హస్తం పార్టీలు ఒక్కటేనన్నారు. గతంలో తాము చెప్పిందే నిజమని కోమటిరెడ్డి వ్యాఖ్యలతో మరోసారి తేలిపోయిందన్నారు. కేసీఆర్‌తో కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. బీజేపీని ఎదుర్కోలేక కేసీఆర్ కాంగ్రెస్, వామపక్షాలతో చేతులు కలుపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, కేసీఆర్ నీచ రాజకీయాల్ని తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని బండి సంజయ్ హెచ్చరించారు.

Tags

Next Story