Telangana: కేసీఆర్ ప్రభుత్వంపై పొంగులేటి తీవ్ర విమర్శలు

Telangana: కేసీఆర్ ప్రభుత్వంపై పొంగులేటి తీవ్ర విమర్శలు
రుణమాఫీ చేయకుండా సెక్రటేరియట్ నిర్మాణం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం దారుణం

తెలంగాణ రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ధరణి వెబ్‌సైట్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పొంగులేటి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ హామీ ఇచ్చిన రుణమాఫీ అమలు చేయకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. రుణమాఫీ చేయకుండా సెక్రటేరియట్ నిర్మాణం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం దారుణమన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తామని చెప్పి పదేళ్లయినా ఇంకా కార్యరూపం దాల్చలేదని విమర్శించారు.

Tags

Next Story