Telangana: సిద్ధిపేటలో పంజాబ్ సీఎం

Telangana: సిద్ధిపేటలో పంజాబ్ సీఎం
కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్టును ప్రశంసించిన సీఎం భగవంత్‌మాన్‌

సిద్ధిపేట జిల్లాలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గురువారం పర్యటించారు. పర్యటనలో భాగంగా కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని చూసిన భగవంత్ మాన్ అద్భుతంగా నిర్మించారని ప్రశంసించారు. కాసేపట్లో కూడవెళ్లి వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్‌లను పరిశీలించనున్నారు. ఇవాళ సిద్దిపేట జిల్లాతో పాటు గజ్వేల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పరిశీలిస్తారు. ఎర్రవెల్లి, నరసన్నపేట గ్రామాలను సందర్శించనున్నారు.

Tags

Next Story