Telangana: ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ..ముందడుగు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ పాదయాత్ర కొనసాగుతుంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రేవంత్ నిప్పులు చెరుగుతూ ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని తాము అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం చేస్తామంటూ భరోసా కల్పిస్తూ పాదయాత్రలో రేవంత్ ముందుకెళ్తున్నారు.
11వ రోజు రేవంత్ పాదయాత్ర స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో కొనసాగుతుంది. యాత్ర ఫర్ చేంజ్ పేరుతో రేవంత్ ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఉదయం కూనూరు నుంచి రేవంత్ యాత్ర ప్రారంభం అయ్యింది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రేవంత్ పాదయాత్రలో ముందుకెళ్తున్నారు. ఇక మధ్యాహ్నాం పామునూర్‌లో భోజన విరామం తీసుకుంటారు. అనంతరం స్టేషన్ ఘన్‌పూర్‌లోని శివాజీ చౌక్ వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో రేవంత్ పాల్గొంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com