Telangana: సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు జేజేలు

సీఎం కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. పలువురు పార్టీ కార్యకర్తలు కేసీఆర్‌కు వినూత్నంగా శుభాకాంక్షలు చెప్తున్నారు. BRS స్టేట్ యూత్ లీడర్ అరవింద్ అలిసెట్టి సిద్దిపేట రంగనాయక్ సాగర్ దగ్గర పారా గ్లైడింగ్ చేస్తూ సీఎం కేసీఆర్‌కు విషేస్ తెలిపారు. హ్యాపీ బర్త్‌డే సీఎం కేసీఆర్..అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినదించారు.
ప్రధాని నరేంద్రమోదీ సైతం కేసీఆర్‌కు బర్త్ డే విషేష్ చెప్పారు. ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ సీఎంవోను ట్యాగ్ చేశారు. గవర్నర్ తమిళి సై సైతం ట్విట్టర్ వేదికగా కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి హరీష్ రావు ట్విట్టర్‌లో కేసీఆర్‌కు బర్త్‌డే విషేష్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కేసీఆర్‌కు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆయుష్య హోమం నిర్వహిస్తున్నారు. 2010 నుంచి స్థానిక శివాలయంలో ఆయుష్య హోమం నిర్వహిస్తున్నారు. డీసీఎంఎస్ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితుల నేతృత్వంలో హోమం నిర్వహించారు. మరోవైపు స్థానిక ఆలయాల్లో కేసీఆర్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com