Telangana: నా భర్త పోలీసులు కొట్టడం వల్లే చనిపోయాడు

మెదక్‌లో ఖదీర్ ఖాన్ అనే వ్యక్తి మృతి వివాదాస్పదం అయ్యింది. దొంగతనం నెపంతో పోలీసులు దారుణంగా కొట్టడంతోనే ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గత నెల 29న జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో మెదక్‌కు చెందిన మహ్మద్ ఖదీర్ ఖాన్‌ను పోలీసులు అనుమానించారు. హైదరాబాద్‌లో ఉన్న ఖదీర్‌ను తీసుకొచ్చారు. లాఠీలతో చితకబాది.. దొంగతనం చేసింది అతను కాదని తేలడంతో వదిలేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఐతే.. పోలీస్ దెబ్బలతో అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరాడు. అకారణంగా తనను చిత్రహింసలకు గురి చేశారని.. పోలీసులు కొట్టిన దెబ్బలతో తన కిడ్నీలు పాడయ్యాయని బాధితుడు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఖదీర్‌ను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ కొంతకాలం చికిత్స పొందాక.. గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. పోలీసులు కొట్టడం వల్లే ఖదీర్ కిడ్నీలు పాడయ్యాయని మృతుడి భార్య సిద్దేశ్వరి ఆరోపిస్తుండగా.. ఖదీర్‌కు గతంలోనే కిడ్నీల సమస్య ఉందని పోలీసులు చెబుతున్నారు. ఐతే వైద్యుల నివేదికే ఈ కేసులో కీలకం కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com