Telangana: బయ్యారంలో స్టీల్‌ప్లాంటుకు కేంద్రం నో పర్మీషన్‌

Telangana: బయ్యారంలో స్టీల్‌ప్లాంటుకు కేంద్రం నో పర్మీషన్‌
బయ్యారంలో స్టీల్‌ప్లాంటు పెట్టడమే లాభదాయకం కాదన్న కేంద్రం, మోదీకి దేశం కంటే ఆప్తుల ప్రయోజనాలే ఎక్కువ కావడం సిగ్గుచేటు

ఖమ్మం జిల్లా బయ్యారంలో స్టీల్‌ప్లాంటుకు భూమి సరిపోదని కేంద్రం తేల్చిచెప్పింది. బయ్యారం ఖనిజంలో నాణ్యత కూడా లేదని స్పష్టం చేసింది. పక్కనే ఉన్న బైలడిల్లా నుండి ఖనిజం సరఫరా చేసుకుంటామని కోరిన రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని మోదీ సర్కారు అంగీకరించలేదు. బయ్యారంలో అసలు స్టీల్‌ప్లాంటు పెట్టడమే లాభదాయకం కాదని చెప్పింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో బయ్యారంలో ప్లాంటు ఏర్పాటుచేస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టంలో స్పష్టంగా హామీ ఇచ్చింది. బయ్యారంలో పలు ప్రాంతాలను కూడా పరిశీలించింది.

ప్రధాని మోదీకి దేశం కంటే ఆప్తుల ప్రయోజనాలే ఎక్కువ కావడం సిగ్గుచేటన్నారు మంత్రి కేటీఆర్. బైలడిల్లా ఐరన్‌ ఓర్‌ను కేటాయిం చి ఏపీ పునర్వ్యువస్థీకరణ చట్టం హామీని నిలుపుకోవాలని డిమాండ్‌ చేశారు. తాము ఏండ్లుగా కోరుతున్నా పట్టించుకోని మోదీ సర్కార్‌.. ఆ గనులను అదానీ గ్రూప్‌నకు కట్టబెట్టిందని ఆరోపించారు. 180 కిలోమీటర్ల దూరంలో బైలడిల్లా నుండి అనుమతివ్వని కేంద్రం‌.. తన సొంత రాష్ట్రంలోని వేయి 800కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంద్రాకు ఖనిజాన్ని తరలించుకుపోయేందుకు అనుమతి ఇవ్వడం ఏంటో అర్థంకాలేదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story