Telangana: వైఎస్‌ షర్మిల అరెస్ట్‌

Telangana: వైఎస్‌ షర్మిల అరెస్ట్‌
X
బహిరంగసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ను అసభ్య పదజాలంతో దూషించిన షర్మిల

మహబూబాబాద్‌ జిల్లాలో వైఎస్‌ షర్మిలను అరెస్ట్‌ చేశారు పోలీసులు. షర్మిల పాదయాత్రకు అనుమతిని రద్దు చేశారు. షర్మిలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు.. పీఎస్‌ వెహికల్‌లో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. శనివారం జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ను షర్మిల అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. అంతకుముందు షర్మిల వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే అనుచరుల పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. షర్మిల నైట్‌ క్యాంప్‌ వద్దకు చేరుకుని నిరసన తెలియజేశారు. అటు మాన్‌ సింగ్‌ తండా వద్ద కూడా ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకున్నారు.

Tags

Next Story