Telangana: హైకోర్టుకు ఖదీర్‌ఖాన్ కేసు

తెలంగాణలో సంచలనంగా మారిన ఖదీర్‌ఖాన్ మృతి కేసును హైకోర్టు సుమోటోగా తీసుకుంది. దీనిపై ఇవాళ విచారణ చేపట్టనుంది. చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, మెదక్ ఎస్పీ, డీఎస్పీ, ఏస్‌హెచ్‌వోలను ప్రతివాదులుగా చేర్చింది. పోలీసుల దెబ్బలకు తట్టుకోలేకనే ఖదిర్ ఖాన్ మృతి చెందినట్లు మీడియాలో వార్తలు రావడంతో. హైకోర్టు సుమోటోగా తీసుకుంది.
గత నెల 27న మెదక్‌లోని అరబ్ గల్లీలో గొలుసు దొంగతనం జరిగింది. బాదితురాలి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఖదీర్‌ఖాన్ అదుపులో తీసుకున్నారు. గత నెల 29న అదుపులోకి తీసుకున్న పోలీసులు ఐదు రోజులు స్టేషన్‌లో ఉంచుకుని విచక్షణారహితంగా కొట్టారు. ఈ నెల 2 తేదీ ఆయన భార్యకు అప్పగించారు. అప్పటికే ఖదీర్‌ఖాన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మెదక్ ప్రభుత్వ హాస్పిటల్, తర్వాత కొంపల్లిలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు బంధువుల సాయంతో తరలించారు. అక్కడ కూడా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో గాంధీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. చివరికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 16న రాత్రి చనిపోయాడు. చనిపోయే ముందు పోలీసులు తనను తీవ్రంగా కొట్టడం వల్లే గాయపడ్డానని మీడియాకు వివరించాడు. ఖదిర్ ఖాన్ మృతికి పోలీసులే కారణమని.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ భార్యతో పాటు బంధువులు మెదక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com