Telangana: జాతీయ మహిళా కమీషన్ ముందు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి జాతీయ మహిళా కమీషన్ ముందు హాజరయ్యారు. గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ పట్ల పరుషపదజాలంతో వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ ఆయనకు ఇటీవలే నోటీసులు జారీచేసింది. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో బీసీ రాజకీయ జేఏసీ కూడా ఫిర్యాదు చేసింది.
జనవరి 25న హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలో నిర్వహించిన ఓ సమావేశంలో గవర్నర్ తమిళి సైని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి కామెంట్స్ చేశారు. అసెంబ్లీ, శాసనమండలి ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ తన దగ్గరే అంటిపెట్టుకుని కూర్చుంటారా అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. ఇదే అంశంపై నేషనల్ విమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com