Telangana: ఉమ్మడి వరంగల్లో గుండాల పాలన

కాంగ్రెస్ నేత తోట పవన్ పై దాడిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండించారు. ఏకశీల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తోట పవన్ ను ఆయన పరామర్శించారు. దాడికి పాల్పడిన నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు అరాచక శక్తులుగా మారారని రేవంత్ విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గూండాల పాలన సాగుతోందన్న ఆయన ఎమ్మెల్యే ఆదేశాలతోనే తనపై దాడి జరిగినట్టు పవన్ చెప్పాడన్నారు. స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పై కేసు ఫైల్ చేయాలన్నారు. రాజకీయ ఒత్తిడి వల్ల, ప్రభుత్వ ఆదేశాల మేరకు నిందితులను కాపాడుతున్నారని రేవంత్ ఆరోపించారు.
ఈ ఘటనపై డీజీపీ స్పందించాలని, క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో తెలుసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై సీపీకి ఫిర్యాదు చేశారు రేవంత్ రెడ్డి. కార్యకర్తలతో కలసి ర్యాలీగా సీపీ కార్యాలయానికి వెళ్లిన రేవంత్ పోలీసు కమీషనర్‌తో కలసి మాట్లాడారు. సీపీ ఆఫీస్ గేటు ముందు బైఠాయించి నిరసన చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com