Telangana: ఢిల్లీకి బీజేపీ కోర్‌ కమిటీ సభ్యులు

Telangana: ఢిల్లీకి బీజేపీ కోర్‌ కమిటీ సభ్యులు
అమిత్‌షా కార్యాలయం నుంచి పిలుపు రావడంతో హస్తినకు

తెలంగాణ బీజేపీ కోర్‌ కమిటీ సభ్యులు హుటాహుటిన ఢిల్లికి వెళ్లారు. కోర్‌ కమిటీ సభ్యులు ఢిల్లీ రావాలంటూ అమిత్‌షా కార్యాలయం నుంచి పిలుపు రావడంతో హస్తినకు బయల్దేరి వెళ్లారు. రేపు కార్నర్‌ మీటింగ్‌ ముగింపు సభలకు హాజరు కావాల్సి ఉన్నా అమిత్‌షా ఆఫీస్‌ నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన వెళ్లారు బీజేపీ నేతలు. కార్నర్‌ మీటింగ్‌లపై రివ్యూలతో పాటు భవిష్యత్‌ కార్యాచరణపై కోర్‌ కమిటి సభ్యులతో అమిత్‌షా చర్చించే అవకాశాలున్నాయి. మరోవైపు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపైనా ఆరా తీయనున్నారు.

Tags

Next Story